Posts

Showing posts from February, 2018

పూవుల గుసగుసలు

మందార మంటుంది మనసునిమ్మని, మల్లె మెరిసింది మంచి పంచమని, కనకాంబరం కులికింది సాయమివ్వమని, లిల్లీ గొంతు కలిపింది పెళ్లి పాటనే నేనని, విరజాజి  విరిసింది సంధ్య కి వెలుగునని, చామంతి ఊగింది జారే జలతారు నేనని, బంతి ముద్దులాడింది చెక్కిళ్ళ మెరుపు నేనని, మొగలి రేకు విప్పింది సుగంధాల పూత నేనని, సంపెంగ మేను వాల్చింది గగనాల లోగిలి నేనని, తామర నాట్య మాడింది మాలిన్యమంటని మేలిమి నేనని, కలువ ఎగసింది వెన్నెల్లో విరిబోణిని నేనేనని గులాబీ నవ్వింది పూల రాణి ని నేనేనని,  గడ్డి పువ్వు నేర్పింది  స్వేఛ్ఛా సౌధాన్ని నేనని..